ఏపీ: విశాఖ ఉక్కు ప్లాంట్ ని అమ్మేస్తున్నారా..?

frame ఏపీ: విశాఖ ఉక్కు ప్లాంట్ ని అమ్మేస్తున్నారా..?

Divya
2024 ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ ఉక్కు విషయంలో ఎలాంటి ప్రైవేటీకరణం ఉండదని, అందులో పని చేసేవారు ఎక్కడికి వెళ్తారని , ఎన్నికల ముందు ఊదరగొట్టారు. నిన్న మొన్నటి వరకు అదంతా ఉత్తిదే అని చెప్పినప్పటికీ కానీ ఇటీవల కాలంలో అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాల పైన ఏ ఒక్క మాట మాట్లాడలేదు. వీళ్లపైన ప్రధాన మోడీ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఇక మనం అర్థం చేసుకోవచ్చు అంటూ ఇటీవలే సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. కానీ కూటమినేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణాన్ని అడ్డుకుంటామంటూ చెబుతూనే ఉన్నారు. కానీ అవన్నీ కూడా ఉత్తి మాటలే అంటూ ఇప్పుడు స్పష్టం అయిపోయిందట.

కేంద్రం మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో ఎలాంటి మార్పు లేదంటూ క్లారిటీ ఇచ్చిందట. కేవలం ఓట్ల కోసమే కూటమినేతలు జనాలని బురిడీ కొట్టించారనే వార్తలు ఇప్పుడు  వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చాప కింద నీరు లాగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేసేందుకు అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా చేయి కలిపారనే విధంగా తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వాలని పబ్లిక్ గ్రీవెన్ మాజీ ఉద్యోగి పాడి త్రినాథ్ ఒక లేఖను కూడా రాశారట.

అయితే ఈ విషయం పైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో భాగంగా ఇలాంటి విష ప్రచారం చేసే వారి పై చర్యలు తప్పవంటూ తెలియజేస్తున్నారు.. విశాఖ ఉక్కు అమ్మేస్తున్నారనే విషయం వాస్తవం కాదంటూ మరొక పోస్ట్ ఏపీ గవర్నమెంట్ చేసింది. మరి ఈ విషయం పైన అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  స్పందిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: