వామ్మో: ఆ పార్ట్ కు మహేష్ హీరోయిన్ ధరించిన రింగ్ ఎన్ని కోట్లో తెలుసా..?

frame వామ్మో: ఆ పార్ట్ కు మహేష్ హీరోయిన్ ధరించిన రింగ్ ఎన్ని కోట్లో తెలుసా..?

Divya
బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ప్రియాంక చోప్రా ప్రతి ఒక్కరి సుపరిచితమే.. మొదట తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆమ్మడు ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అక్కడ స్టార్ హీరోల చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది తన నటనతో డాన్స్ తో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ రేంజ్ లో పలు చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగింది.
హాలీవుడ్ స్టార్ నిక్ జోనస్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది.. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించి నేషనల్ స్టార్ గా పేరు సంపాదించిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నది. అయితే ఇటీవలే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ,రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న..SSMB -29 సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె తెలుగు ప్రాంతాలలో దేవాలయాలను చుట్టి వేయడమే కాకుండా ఇక్కడ వారికి సంబంధించిన అన్ని విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉన్నది. అందుకే ప్రియాంక చోప్రా పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది.

అయితే ప్రియాంక చోప్రా ఎప్పుడూ కూడా లగ్జరీ ట్రెండీ వేర్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇటీవలే విమానాశ్రయంలో కనిపించిన ఈ అమ్మడు బ్లాక్ అండ్ బ్లూ కలర్ అవుట్ షూట్లో బ్లాక్ గాగుల్స్ లో కనిపించడం జరిగింది. అయితే ఈమె బెల్లీ బటన్ రింగ్ డైమండ్ ది ధరించింది. ఇది ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపించడం జరిగింది ఈ విషయం పైన అభిమానులు, నేటిజెన్సీ సైతం దీని ధర ఎంత అని ఆరా తీయగా అక్షరాల 2.4 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు తెలియజేశారు.. ప్రియాంక చోప్రా అన్ని కోట్లు పెట్టి మరి బెల్లి పార్ట్ కి ధరించింది అంటే ఆమె రేంజ్ ఎలా ఉన్నదో చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: