ధనుష్ రజినీకాంత్ ల అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇచ్చినప్పటికి కూడా తన మామ రజినీకాంత్ ని రజినీకాంత్ సినిమాలను అభిమానిస్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా ఆయన నేను రజినీకాంత్ కి అభిమానినే అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ధనుష్ కోసం ఓ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారట కాదు కాదు ఓ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చారట సూపర్ స్టార్ రజినీకాంత్.మరి ఇంతకీ ధనుష్ కోసం రజినీకాంత్ ఏ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చారు.. ఎందుకు ఆమెకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ధనుష్ లు దాదాపు 18 ఏళ్ల సంసార జీవితానికి స్వస్తి పలికి విడాకులు తీసుకున్నారు.అయితే వీరి విడాకులు చాలామందికి బాధ మిగిల్చాయి.చివరికి కుటుంబం కూడా వీళ్లు కలిసి ఉండాలి అని తమ సర్వశక్తుల ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు.అలా వీరి బంధం ముగిసింది.
అయితే విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కలిసే పాల్గొంటున్నారు.ఈ విషయం పక్కనపడితే ధనుష్ ఐశ్వర్యల విడాకులకు కారణం చాలామంది పేర్లు తెరమీదకి వినిపించాయి. ముఖ్యంగా ధనుష్ కి అమ్మాయిల అలవాటు ఉండడంతో అది సహించలేని ఐశ్వర్య ధనుష్ తో విడాకులు తీసుకుందని అంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ తమిళ జర్నలిస్టు ధనుష్ విడాకులకు ఆ హీరోయిన్ కారణం అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు తమిళ జర్నలిస్టు చేయార్ బాలు మాట్లాడుతూ.. ధనుష్ ఐశ్వర్య విడాకుల కారణం అమలాపాలే.అమలాపాల్ తో ధనుష్ వీఐపీ 2, వడ చెన్నై, రఘువరన్ బీటెక్ వంటి సినిమాలు చేసిన సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది.ముఖ్యంగా విఐపి2 సినిమా చేస్తున్న సమయంలో ధనుష్ ఇంటికి కూడా రాకుండా అమలాపాల్ ఇంట్లోనే ఉంటూ సహజీవనం చేశారు.
ఈ విషయం తెలిసిన ఐశ్వర్య అమలాపాల్ ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ వినకపోవడంతో రజినీకాంత్ విషయంలో కలగజేసుకొని అమలాపాల్ ఇంటికి వెళ్లి ఎందుకు నా అల్లుడి కూతురు జీవితం నాశనం చేస్తున్నావ్.ఇంకోసారి వాళ్ళ జీవితంలోకి రాకు అని వార్నింగ్ ఇవ్వగా అమలాపాల్ మాత్రం భయపడకుండా ఫస్ట్ మీ అల్లుడికి చెప్పుకోండి. నన్ను ఎందుకు అంటారు అని ఆమె కూడా సీరియస్గా రియాక్ట్ అయిందట.కూతురు జీవితం కాపాడడం కోసం రజనీకాంత్ అమలాపాల్ కి వార్నింగ్ ఇచ్చిన కూడా ధనుష్ మారలేదని ఆ జర్నలిస్టు చెప్పారు.అలా అమలాపాల్ వల్లే ధనుష్ ఐశ్వర్య విడిపోయారంటూ ఆ జర్నలిస్ట్ చెప్పడంతో ప్రస్తుతం ఈయన చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి