యానిమల్ సినిమా తో తన క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాడు సందీప్ రెడ్డి వంగ. అయితే చూస్తుండగానే యానిమల్ సినిమా వచ్చి ఐదు నెలలు దాటిపోయింది. కానీ ఇప్పటివరకు స్పిరిట్ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా బయటికి రానివ్వలేదు సందీప్ రెడ్డి వంగ. ఎందుకో ఈ సినిమాపై అప్డేట్స్ ఇవ్వడం లేదు. అసలు సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్నట్లుగానే ఈ సినిమా కరెక్ట్ డేట్ కి రిలీజ్ చేస్తారా..? అసలు షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు..? లేదంటే రాజా సాబ్ సినిమా చేస్తున్నారా..? ఇలా వందల ప్రశ్నలు ప్రభాస్
అభిమానుల గుండెల్లో మెదులుతున్నాయి. అయితే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు అటు రాజా సాబ్ సినిమా సైతం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ స్పిరిట్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం బయటికి రానివ్వడం లేదు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ చేసుకుంటున్న ఈ రెండిటితో పాటు స్పిరిట్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు
వినబడుతున్నాయి. కానీ అప్డేట్స్ మాత్రం బయట పెట్టడం లేదు. పైకి చెప్పట్లేదు కానీ అన్ని పనులను పక్కా ప్లాన్ తో సందీప్ రెడ్డి వంగా కంప్లీట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాల తరువాత సినిమాని స్టార్ట్ చేస్తాడట ప్రభాస్. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఇకపోతే అనుకున్న దానికంటే కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. యానిమల్ తో సందీప్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. స్పిరిట్‌లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ చెప్తానంటున్నారు వంగా. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్న దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది..!!