ప్రశాంత్ వర్మ మూవీ నుండి రణవీర్ సింగ్ అవుట్.. ఎందుకంటే..!?

Anilkumar
హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో వినబడుతోంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. చాలా చిన్న సినిమాగా చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. అంతేకాదు ఓటీటీ లో సైతం మంచి వ్యూస్ సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఓటీటీ లో హిందీలో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమా

 తరువాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అని సినిమా ప్రకటించాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసినట్లుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. కాగా ఈ ఇందులో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారు అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. అంతేకాదు ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అన్నదానిపై కూడా ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. ఇకపోతే ఈ సినిమా తో పాటు ఆయన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో మరొక సినిమా చేస్తున్నాడు. రాక్షస అనే టైటిల్ తో ఈ సినిమా

 తెరకెక్కబోతోంది అని అంటున్నారు. అంతేకాదు సైలెంట్గా షూటింగ్ కూడా జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుండి హీరో  తప్పుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. దర్శకుడి కి హీరోకి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో రణవీర్ సింగ్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు గా టాక్ వినబడుతోంది. అయితే మొన్న ఆ మధ్య ఏప్రిల్ లో రణవీర్ సింగ్ హైదరాబాద్ కి వచ్చాడు. ఇక అప్పుడు రాక్షస సినిమా కోసమే రణవీర్ సింగ్ హైదరాబాద్ కు వచ్చాడు అని రణవీర్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఇప్పుడు రణవీర్ ఇందులో నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  రాక్షస కూడా మన పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించాలని అనుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా లో హీరో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడంతో హీరో తప్పుకున్నాడని తెలుస్తోంది. .!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: