పాపం.. నాని సినిమాకి బడ్జెట్ ప్రాబ్లం..!?

Anilkumar
ఇటీవల హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాచురల్ స్టార్ నాని. దానికంటే ముందు దసరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇప్పుడు నాని సుజిత్ కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. డీ వీ వీ దానయ్య  నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తో నాని అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. తర్వాత

 తన తదుపరి సినిమాని నానితో చేయబోతున్నాడు. ఇకపోతే నాని ఇప్పటికే సరిపోదా శనివారం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతోంది. అయితే సరిపోదా శనివారం సినిమా చేస్తున్న డివివి దానయ్య ఈ సినిమాను సైతం లైన్లో పెట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓ జి సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమాని సైతం స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సుజిత్ నానితో తీస్తున్న ఈ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్ తో తీయాలి అని

 అనుకుంటున్నాడట. కానీ నిర్మాతలు మాత్రం నాని తో అంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికి కాస్త ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.  నాని కెరియర్ లోనే 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా దసరా సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమా సైతం కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ ఆ సినిమా కూడా బాగానే వర్క్ అవుట్ అయింది. కానీ హాయ్ నాన్న సినిమా మాత్రం 100 కోట్లు రాబట్టలేకపోయింది. అయితే సినిమా బడ్జెట్ రిలీజ్ ని బట్టే వసూళ్లు ఉంటాయి. సుజిత్ డైరెక్షన్ లో నాని సినిమాకు భారీ బడ్జెట్ అవుతుందని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ప్రాజెక్ట్ ని కొనసాగించాలా లేదా ఆపేయాలా అన్న చర్చలు జరుగుతున్నాయి. మరి నాని సుజిత్ కాంబినేషన్ లో సినిమా అనుకున్న బడ్జెట్ తో అవుతుందా లేదా అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: