రణవీర్, ప్రశాంత్ వర్మ సినిమాకి టైటిల్ ఫిక్స్.. ఏంటంటే..!?

Anilkumar
ఇటీవల హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తేజ సబ్జా హీరోగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది ఈ సినిమా.  ఇక ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఈ సినిమానే టాప్ సినిమాగా నిలిచింది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే హనుమాన్ సినిమా స్టార్ హీరో సినిమాలను సైతం వెనక్కి నెట్టేసింది అని చెప్పొచ్చు. దీంతో ప్రశాంత్ వర్మ క్రేజ్ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో చేరింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్

 సినిమాలకి తెలుగు ప్రేక్షకులతో పాటు అటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. దీంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈయన తదుపరి సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రశాంత్ వర్మ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే గత కొద్దిరోజులుగా

 వస్తున్న ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీనికి ఓ వైలెంట్ టైటిల్ను ఫిక్స్ చేశారట. తన సినిమాలకు టైటిల్స్ ఎప్పుడూ కాస్త కొత్తగానే పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రశాంత్ వర్మ. అలాగే ఈ సినిమాకు బ్రహ్మ రాక్షస అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఈ టైటిల్ వినగానే ప్రేక్షకులకు మరోసారి ఏదో వండర్ క్రియేట్ చేయబోతున్నారని అంచనాలు మొదలయ్యాయి. హనుమాన్ సినిమా నుంచి సూపర్ హీరోల కథలపై దృష్టి సారించిన ప్రశాంత్ వర్మ.. వీరి కాంబో కోసం కూడా అలాంటి జానర్‌నే ప్లాన్ చేసి ఉంటారని టాక్. ఇటీవల ప్రశాంత్ వర్మ రణ్‌వీర్‌ను కలిసి.. కథ వినిపించాడట. ప్రశాంత్ వర్మ నరేషన్, కథను చెప్పిన విధానం బాగా నచ్చడంతో రణ్‌వీర్‌ సింగ్ వెంటనే సినిమాకు ఓకే చేసినట్లు తెలుస్తుంది. మూవీ షూటింగ్ హిందీలో జరిగినా.. మిగతా భాషల్లో కూడా సినిమా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: