అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ రత్నం సినిమా..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ సినిమా రత్నం. పోలీస్ యాక్షన్ డ్రామా సినిమాలకు కేరాఫ్ అడ్రస్క మారిన హరి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అయితే ఏప్రిల్ 26న తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదలై పాజిటివ్ చేసుకుంది రత్నం సినిమా. అయితే ఈ సినిమాకి ఓపెనింగ్ కూడా బాగానే జరిగాయి అని చెప్పాలి. అయితే సినిమా స్టార్టింగ్ నుండి ఊహించని ట్విస్ట్ లతో భారీ ఫైట్స్ తో ఆడియన్స్ను బాగా ఎంటర్టైన్ చేసింది. అయితే థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్

 స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డీల్ భారీ ధరకు కుదిరించుకున్నట్లుగా కూడా సమాచారం వినబడుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మే 24 నుండి ఓటిటి లోకి అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కు

 రాబోతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జి స్టూడియోస్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఆమెతో పాటు సముద్రఖని విజయకుమార్ మురళీ శర్మ యోగి బాబి వంటి వారు కొన్ని కీలక పాత్రల్లో కనిపించారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ రత్నం కు స్వరాలందించారు. ఎమ్ సుకుమార్ టోగ్రాఫర్ గా వ్యవహరించగా టిఎస్ జై ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక కథ విషయానికి వస్తే.. ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.. ఎమ్మెల్యే పన్నీర్‌స్వామికి (సముద్రఖని) రత్నం (విశాల్ ) నమ్మిన బంటుగా ఉంటాడు. అలాంటి రత్నం జీవితంలోకి అనుకోకుండా మల్లిక (ప్రియా భవానీ శంకర్‌) అనే అమ్మాయి వస్తుంది. అయితే మల్లికను చంపడానికి లింగం బ్రదర్స్ ప్రయత్నిస్తుంటారు. మరి లింగం బ్రదర్స్ బారి నుంచి మల్లికను రత్నం ఎలా కాపాడాడు?  అన్నది సినిమా స్టోరీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: