బంపర్ ఆఫర్ కొట్టేసిన నయనతార.. ఈసారి ఏకంగా ఆ సూపర్ హిట్ డైరెక్టర్ తో..!?

Anilkumar
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చిన నయనతార అక్కడ కూడా మంచిగా సక్సెస్ అందుకుంది. అయితే తాజాగా ఇప్పుడు నయనతార మరొక బాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అయితే ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినబడుతోంది. ఒకవైపు పిల్లలు మరొకవైపు భర్త సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు సినిమాల్లో బిజీ గా ఉంది నయనతార.

 దక్షిణాది ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా రానిస్తున్న నయనతార చాలా కాలం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నయనతార భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం నయనతార తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉంది. అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్‌ 1960. దర్శకుడు డ్యూడ్‌ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 శ్యాన్‌ లోల్డన్‌ సంగీతం, ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ గత ఏడాది ప్రారంభమైంది. ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంగా రూపొందుతోంది. కాగా ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అయితే నయనతార తన పోర్షన్‌ను పూర్తి చేశారట. అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం టెస్ట్‌. నటుడు మాధవన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్‌ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: