పుష్ప 2 టీజర్ తో మరో రికార్డ్ సాధించిన అల్లు అర్జున్.. ఈసారి ఏకంగా అలా..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత రెండేళ్లుగా కెరియర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అని చెప్పొచ్చు. అందులో భాగంగానే అల్లు అర్జున్ కి లక్కు సైతం బాగా కలిసి వస్తోంది. హీరోగా వరుస సినిమాలు చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో సంపాదించుకున్నాడు. అలాగే సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప టు సినిమాకి సంబంధించిన టీజర్ ను సైతం విడుదల చేశారు. అయితే ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అంతేకాదు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏ స్థాయిలో కష్టపడుతున్నారో టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే పుష్ప 1 సినిమా విడుదలై ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు పుష్ప టు సినిమా విడుదల కాకముందే టీజర్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు బన్నీ ఖాతాలోకి మరొక అరుదైన రికార్డు చేరింది. అయితే ఈ టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్వన్ స్థాయిలో కొనసాగడం గమనార్హం. పుష్ప టు టీజర్ కు యూట్యూబ్ లో ఏకంగా 110 మిలియన్ల వ్యూస్ 1.55 మిలియన్ లైకులు వచ్చాయి.

అంతేకాదు 138 గంటలపాటు యూట్యూబ్లో టీజర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దీంతో బన్నీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ రికార్డ్ బ్రేక్ కావాలంటే కూడా చాలా సమయం పడుతుందని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. టీజర్ తోనే ఈ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ సినిమా కలెక్షన్లతో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. విజువల్ గా ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతుందని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: