ఆ హీరో సినిమాలను బ్యాన్ చేయండి.. బిజెపి ఫిర్యాదు?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రాజకీయ వేడి కనిపిస్తుంది. అన్ని పార్టీలకు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో దూకుడు చూపిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి అన్ని పార్టీలు. ఇలాంటి సమయంలో ఇక ఎన్నికలు కూడా అమలులోకి రావడంతో ఇలాంటి ప్రచారాలకు ఎక్కడ తావు లేకుండా పోయింది. దీంతో ఇక ఎవరు కాస్త ప్రచారం చేసినట్లు కనిపించిన ప్రత్యర్థి పార్టీ సభ్యులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం చేస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడంటూ ఒక హీరో పై ఆరోపణలు చేసింది. ఏకంగా ఆ హీరో నటించిన సినిమాలపై బ్యాన్ విధించాలి అంటూ బిజెపి ఎన్నికల కమిషన్ కోరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ గురించి బిజెపి ఇలాంటి ఆరోపణలు చేసింది. ఏకంగా అతని సినిమాలు ప్రకటనలు, హోర్డింగ్ లపై  నిషేధం విధించాలి అంటూ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది బిజెపి.

 అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న శివరాజ్ కుమార్ సతీమణి గీత శివమొగ్గలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు కూడా హీరో శివరాజ్ కుమార్ సినిమాలను ప్రకటనలను ప్రసారం చేయకుండా సోషల్ మీడియా, టీవీ, థియేటర్లలో కూడా ఆదేశించాలి అంటూ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించి రిక్వెస్ట్ చేసింది బిజెపి. బిజెపి రిక్వెస్ట్ ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని కర్ణాటక ఎన్నికల అధికారులు చెప్పుకొచ్చారు. మరి ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: