స్టేజ్ పై డీజే టిల్లు చేసిన పనికి అందరూ షాక్.. నువ్వు ఇలాంటోడివి అనుకోలేదంటూ?

praveen
హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రస్తుతం కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరియర్ ను  కొనసాగించాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా రైటర్ గా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు అని చెప్పాలి. ఇక సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న గుంటూరు టాకీస్ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో.. కొంత గుర్తింపును సంపాదించుకో గలిగాడు. ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలో నటించడంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక డీజే టిల్లు మూవీతో ఎంత సెన్సేషన్ విజయాన్ని సాధించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 డీజే టీల్లు మూవీ ఏకంగా కుర్రకాలలో సిద్దు జొన్నలగడ్డకు విపరీతమైన క్రేజ్ పెంచేసింది. ఇక ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు ఉన్న సిద్దు మాత్రం తన వన్ మాన్ షో తో మెస్మరైజ్ చేశాడు అని చెప్పాలి. ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ డైలాగ్ డెలివరీ మేనరిజం అన్నీ కూడా ఆడియన్స్ ని కట్టిపడేసాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ రాబోతుంది. టిల్లు స్క్వేర్ అనే టైటిల్తో సీక్వెల్ తెరకెక్కించారు.  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచేసింది.

 అయితే ఇటీవల హీరో సిద్దు జొన్నలగడ్డ చేసిన పని మాత్రం అతని అభిమానులు అందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలా చేసింది. టిల్లు స్క్వేర్ నుంచి ఇటీవల ఒక బ్రేకప్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ టీం మొత్తం ప్రెస్ మీట్ కి హాజరయ్యారూ. అయితే మీడియా ఫోటోలు తీస్తున్న సమయంలో సిద్దు  అనుపమతో కలిసి ఫోటోలు దిగారు. అయితే ఆ సమయంలో ఏకంగా హీరోయిన్ ముట్టుకోకుండా.. ఆమెను చేయి కూడా తగలకుండా ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు ఈ యంగ్ హీరో. దీంతో అతని సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు ఇంటర్నెట్ జనాలు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. నీ సినిమాలు చూసి నువ్వు ఏంటో అనుకున్నాం. కానీ ఇంత జెంటిల్మెన్ అనుకోలేదు అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: