చిన్నపిల్లడిలా మారిన గ్లోబల్ స్టార్.. కూతురితో ఎలా ఆడుకున్నాడో చూడండి?

praveen
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్.. ఇక ఎప్పుడు వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేజర్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

 అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతూ ఉండడం గమనార్ హం. దీంతో చరణ్ గత కొన్ని రోజుల నుంచి వైజాగ్ లోనే ఉంటున్నారు. కాగా ఇటీవల చరణ్ సతీమణి  ఉపాసన తన కూతురు క్లింకార తో కలిసి వైజాగ్ వెళ్ళింది. ఇక షూటింగ్ బ్రేక్ సమయంలో భర్త చరన్ తో కలిసి వైజాగ్ తీరంలో సరదాగా గడిపింది ఈ మెగా కోడలు. ఇక రామ్ చరణ్ క్రేజీ మూవీ అయినా ఆరెంజ్ మూవీ లోనుంచి రూబా రుబా అనే సాంగ్ను జోడి చేసి అటు ఉపాసన ఒక వీడియోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇక ఈ వీడియోలో రామ్ చరణ్ తన కూతురు క్లింకార తో ఇక సముద్ర తీరంలో ఎంతో సరదాగా ఆడుకుంటున్నాడు.

  ఉపాసన క్లింకారతో పాటు చెర్రీకి ఎంతో ఇష్టమైన పెట్ రైమ్ కూడా అక్కడే ఉండడం గమనార్హం. మార్నింగ్ సన్రైజ్ చూస్తూ క్లింకారతో కలిసి చిన్న పిల్లాడిలా మారిపోయి సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్నాడు ఈ గ్లోబల్ స్టార్. కూతురి పాదాలను సముద్రపు నీటితో తాకిస్తూ ఎంజాయ్ చేశాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ వీడియో అభిమానులందరినీ కూడా తెగ ఆకట్టుకుంటుంది. ఎంతటి గ్లోబల్ స్టార్ అయినా సరే ఇక పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు చిన్నపిల్లాడిలా మారిపోవాల్సిందే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా గేమ్ చేంజ్ తో పాటు మరికొన్ని రోజుల్లో రామ్ చరణ్ బుచ్చిబాబు సనా సానాతో మరో మూవీని ప్రారంభించబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: