ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లిస్టులోకి.. క్రేజీ డైరెక్టర్.. ఇక ఇండస్ట్రీ రికార్డులు బద్దలేనా?

praveen
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ రెబల్ స్టార్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు డార్లింగ్ గా కొనసాగిన ప్రబాస్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. కానీ ఇక ప్రభాస్ కి బాహుబలి తర్వాత అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఇక వరుసగా ప్లాపులతో సతమతమయ్యాడు అని చెప్పాలి. అయితే ఇటీవలే దాదాపు 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో డార్లింగ్ అభిమానులు అందరికీ కూడా సలార్ మూవీ ఫుల్ మీల్స్ పెట్టేసింది అని చెప్పాలి.

 ఇకపోతే ప్రభాస్ తర్వాత సినిమాలపై కూడా భారీ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే మూవీలో నటిస్తూ వున్నాడు ప్రభాస్. అంతేకాకుండా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే మూవీలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, గౌతమ్ తిననూరితో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లిస్టులోకి ఒక క్రేజీ డైరెక్టర్ వచ్చి చేరాడు అన్నది తెలుస్తుంది. ఇక క్రేజీ డైరెక్టర్ ఎవరో తెలిసి ప్రభాస్ అభిమానులు అందరూ కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఇటీవల కాలంలో తనదైన సినిమాలతో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేస్తున్న లోకేష్ కనకరాజ్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడట.

 ఇప్పటికే లోకేష్ కనకరాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ ప్రారంభించి అవెంజర్స్ తరహాలో ఏకంగా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇక మరోవైపు ఇతర హీరోలతో కూడా సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్నాడు. కాగా ఇప్పుడు ప్రభాస్ తో కూడా సినిమాకు రెడీ అయ్యాడట  కర్ణాటక కు చెందిన కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై టాలీవుడ్ హీరో ప్రభాస్ తో లోకేష్ కనకరాజ్ మూవీ తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: