మరి అంత తక్కువా.. రజనీకాంత్ మొదటి పారితోషకం ఎంతో తెలుసా?

praveen
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఒక బస్ కండక్టర్  స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ నటుడు స్థాయికి ఎదిగారు ఆయన. ఇక తన స్టైల్ అండ్ యాక్టింగ్ తో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాటిపోతున్న వరుసగా సినిమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులందరినీ కూడా అలరిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం పారితోషకం విషయంలో కూడా అటు రజనీకాంత్ టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు 100 కోట్లకు పైగానే ప్రస్తుతం రజనీకాంత్ ఒక్కో సినిమాకి రెమ్యూనరేషన్  తీసుకుంటున్నాడు.

 ఇలా ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర పారితోషకం అందుకుంటున్న నటులలో మొదటి వరుసలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి  అయితే ఇలా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ టాప్ రెమ్యూనరేషన్  తీసుకుంటున్న హీరోలు ఇక కెరియర్ తొలినాళ్లల్లో మొదటి పారితోషకం ఎంత తీసుకొని ఉంటారు అనే విషయం తెలుసుకోవడానికి అభిమానులందరూ కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే  సూపర్ స్టార్ రజినీకాంత్ తొలి పారితోషికం ఎంత అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 అయితే ఎవరు ఊహించనీ విధంగా కేవలం రెండు వేల రూపాయల పారితోషకాన్ని మాత్రమే తన మొదటి సినిమాకి తీసుకున్నాడట రజనీకాంత్. 1975లో కమల్ హాసన్ హీరోగా నటించిన అపూర్వ రాగంగల్ అనే సినిమాతో రజినీకాంత్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. బాలచందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఇక ఈ మూవీలో నటించినందుకుగాను రజినీకాంత్ కు పారితోషకంగా 2000 రూపాయలు ఇచ్చారట. ఇక ఈ విషయాన్ని గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన దివంగత నటి శ్రీదేవి పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయితే ఈ మూవీ కోసం అటు కమల్ హాసన్ మాత్రం 30 వేల పారితోషికం అందుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: