ఈ బుడ్డోడి రెమ్యూనరేషన్ ఒక్క రోజుకి ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం చాలా కష్టమని అందరూ భావిస్తుంటారు. కానీ అవకాశాలు వచ్చినా కూడా కొందరు దాన్ని సరిగ్గా వినియోగించుకోరు. టాలెంట్ ఉండి ఏం లాభం దాన్ని సరిగ్గా సరైన సమయంలో వినియోగించుకోవాలి. ఇక ఇవన్నీ సరిగ్గా ఫాలో అయిన ఒక బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన బుడ్డోడు రోహన్ రాయ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ బుడ్డోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో 90 వెబ్ సిరీస్ లో తన నటనతో

అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఈ బుడ్డోడికి ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది. దాంతో ప్రస్తుతం ఈ బుడ్డోడు రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనోడు ఇప్పుడు ప్రాజెక్ట్ లెక్క కాకుండా రోజుల లెక్క రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంట. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. రోజుకు రూ.30 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నాడంట. అంటే ఎన్నిరోజులు షూటింగ్ ఉంటే అన్ని రోజులు.. నిర్మాత రోజుకు రూ.30 వేలు ఇవ్వాలి. పైగా రోహన్ రాయ్ ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అయ్యింది కాబట్టి.. రానుపోనూ ఫ్లైట్ ఛార్జెస్,

హోటల్ స్టే యాడాన్ అనమాట. ఇలా చూసుకుంటే.. రోహన్ రాయ్ కి రోజుకు ఖర్చు రూ.40 నుంచి 50 వేలు అవుతుంది.  ఒక చిన్న రోల్ వచ్చినా కూడా దానిని షూట్ చేయాలి అంటే నెల రోజులు అయినా పడుతుంది. ఒకవేళ ఫుల్ లెంగ్త్ రోల్ వచ్చిందంటే.. 60 రోజులు షూటింగ్ ఉంది అనుకుందాం. అప్పుడు 60 రోజులకు రూ.30 వేలు చొప్పున వేసుకుంటే.. రోహన్ రాయ్ కి రెమ్యూనరేషన్ కింద రూ.18 లక్షలు ఇవ్వాలి. ట్రావెలింగ్, స్టే ఖర్చులు అదనం. ఇలా చూసుకుంటే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గట్టిగానే సంపాదిస్తున్నాడు. అయితే ఎవరికీ ఏదీ ఊరికే ఇచ్చేయరు అనే విషయాన్ని మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: