రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే.. బ్లాక్ బస్టర్ అయ్యే ప్రభాస్ ఫ్లాప్ సినిమాలు ఇవే?

praveen
ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ప్రభాస్ హిట్ అనే పదానికి దూరమైపోయాడు. బాహుబలి తర్వాత దాదాపు ఆరేళ్లపాటు ప్రభాస్ ఎన్ని సినిమాలు తీసిన అటు బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాతో మాత్రం ఒక సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు ఈ పాన్ ఇండియా హీరో.

 ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరికొన్ని సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే పాన్ ఇండియా రేంజ్ హీరోగా ఎదిగిన తర్వాత మాత్రమే కాదు అంతకు ముందు కూడా ప్రభాస్ కెరియర్ లో ఎన్నో ఫ్లాప్స్ చవిచూశాడు అని చెప్పాలి. భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. అయితే ఇలా ప్రభాస్ కెరియర్లో ప్లాప్ అయిన కొన్ని సినిమాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ రీ రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయ్యే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ వివరాలు చూసుకుంటే..

 మున్నా  : అప్పట్లో సూపర్ సక్సెస్ ట్రాక్ లో ఉన్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఇది ఊహించని విధంగా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేదే కానీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తల్లి సెంటిమెంట్ అంతగా సినిమాకు సెట్ అవ్వలేదు. ప్రభాస్ తండ్రి అయిన ప్రకాష్ రాజ్ వాళ్ళ అమ్మని అమ్మేయడం.. దానివల్ల ఆమె చనిపోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. ఇక ఈ సీన్ ని కనుక రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కొంతమంది విశ్లేషకులు భావన.

 యోగి : ప్రభాస్, నయనతార కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యేది. అయితే ఈ మూవీలో కూడా తల్లి సెంటిమెంట్ ఉంటుంది. అయితే సినిమా చివర్లో కనీసం తల్లి మొహాన్ని కూడా ప్రభాస్ చూసేందుకు అవకాశం ఉండదు. ఇది ప్రేక్షకులకు నచ్చలేదు  అయితే చివర్లో ప్రభాస్ అతని తల్లిని కలిసినట్లుగా రీ ఎడిట్ చేసి సినిమాని విడుదల చేస్తే మాత్రం సూపర్ హిట్ అవుతుందని అభిమానుల అంచన.

 చక్రం : ఈ సినిమా అంతా అద్భుతంగా ఉంటుంది  కథ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది  కానీ చివర్లో హీరో పాత్ర చనిపోవడం మాత్రం ప్రేక్షకులకు అస్సలు నచ్చదు  ఇదే సినిమాకు మైనస్ గా మారింది  ఇక ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ని ప్రభాస్ బతుకున్నట్టుగా ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే మాత్రం సూపర్ హిట్ అవడం ఖాయం అని ఎంతోమంది అభిమానులు అనుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: