మామ కోసం.. ఎన్నికల ప్రచారం చేయబోతున్న అల్లు అర్జున్?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఐకానిక్ స్టార్ అనే మరో ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 అనే మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత కూడా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా లైన్ లో పెట్టేసాడు అల్లు అర్జున్.

 అయితే ఇక ఇప్పుడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా అల్లు అర్జున్ మరికొన్ని రోజుల్లో రాజకీయాల్లో ప్రచారం చేయబోతున్నాడు అదేంటి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ రాబోతున్నాడ అని ఆశ్చర్యపోతున్నారు కదా.  అయితే అంతలా ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అల్లు అర్జున్ నేరుగా రాజకీయాల్లోకి రావడం లేదు. కానీ తన మామ తరుపున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మామ అనగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకునే.రు అలా అనుకుంటే పొరపాటు పడ్డట్టే.

 ఇంతకీ అల్లు అర్జున్ ప్రచారం చేయడానికి సిద్ధమైన మామ ఎవరో తెలుసా.. తన భార్య స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. ఇలా తన మామ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట అల్లు అర్జున్   చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేవలం పార్టీలో చేరడమే కాదు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పగా ఇక సీట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒకవేళ ఆయన మల్కాజిగిరి ఎంపీ స్థానంలో బరిలోకి దిగితే ఆయన తరపున అల్లు అర్జున్ ఇక మామకు సపోర్టుగా ప్రచారం చేస్తారు అని ఒక టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: