ట్రైలర్: అదిరిపోయిన టిల్లు స్క్వేర్ ట్రైలర్..!!

Divya
టాలీవుడ్ లో యంగ్ హీరోగా సిద్దు జొన్నలగడ్డ మంచి పాపులారిటీ సంపాదించుకున్న చిత్రం డీజే టిల్లు.. ఈ సినిమా తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా వన్ మ్యాన్ షో గా నిలిచారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే గడచిన కొద్ది నిమిషాల క్రితం ట్రైలర్ ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.


టిల్లు స్క్వేర్ సినిమాలు సిద్దు కి జోడిగా అనుపమ నటిస్తోంది. ఈ సినిమా లో అనుపమ ముడిపెన్నడూ లేని విధంగా గ్లామర్ డోస్ పెంచేసినట్టు కనిపిస్తోంది.. డీజే టిల్లు లో ఒక అమ్మాయి చేతిలో మోసపోయానని ఆ తర్వాత మర్డర్ కేసులో ఇరుక్కుని చివరికి సిద్దు ఎలా తప్పించుకున్నారో చూపించారు.. కానీ టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో కూడా ఒక అమ్మాయి కారణంగా సిద్దు ఎదుర్కొన్న సమస్యల గురించి చూపించినట్టుగా తెలుస్తోంది.

అంతేకాకుండా అనుపమ సిద్దు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా గట్టిగానే ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి ఇందులో కూడా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అనుపమ, సిద్దు మధ్య డీప్లిప్లాక్ సన్నివేశాలు కూడా ఈ ట్రైలర్లు చూపించారు. అందరిని ఆసక్తి పెంచేస్తున్న ఈ సినిమా ట్రైలర్ యూత్ని సైతం బాగానే ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరి ఏ మేరకు ఈ సినిమా డిజె టిల్లులాగా సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ఇల్లు స్క్వేర్ ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: