బాహుబలి కంటే ముందు ప్రభాస్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ

Anilkumar
బాహుబలి కంటే ముందు ప్రభాస్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ లేదంటే 'మిర్చి' అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రభాస్ కెరియర్ లోనే మైల్ స్టోన్ మూవీ గా నిలిచింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత 'రెబల్' తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. అలాంటి సమయంలో వచ్చిన సినిమా 'మిర్చి'. ప్రభాస్ ఓ కొత్త దర్శకుడుతో మిర్చి అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ వచ్చినా పెదగా హైప్ ఏర్పడలేదు. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పటినుంచి ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోనూ ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత పాటలు ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ సరసన అనుష్క ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. సీనియర్ నటి నదియా ఈ సినిమాతోనే టాలీవుడ్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం యూవి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాతోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అలా 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ ఏడాదితో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న 'మిర్చి' సినిమా గురించి ఎవరికి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. అప్పటికే రచయితగా కొన్ని సినిమాలకు పని చేసిన కొరటాల శివ మిర్చి కథను మొదటగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర కి వినిపించారు. కథ విన్న ఆయన ఇలాంటి పాయింట్ తోనే 'బిందాస్'' సినిమాని అప్పటికే నిర్మించడంతో రిజెక్ట్ చేశారట. దాంతో యూవి క్రియేషన్స్ నిర్మాతలైన వంశీ ప్రమోద్ లకు ఈ కథ వినిపించడం, వాళ్లు కూడా అదే టైంలో నిర్మాణరంగంలోకి రావాలని చూస్తుండడం, కథ కూడా నచ్చడంతో వెంటనే ఓకే చేసేసారు.
2. నిజానికి మిర్చి కథను ప్రభాస్ ముందుగా ఓకే చేయలేదు. దానికంటే ముందే రాజమౌళి బాహుబలి కి కమిట్ అయ్యాడు. అయితే రాజమౌళి తన ప్రాజెక్ట్ కి టైం పడుతుంది అని చెబితే అప్పుడు ప్రభాస్ ఓకే చెప్పాడు.
3. ముందుగా ఈ సినిమాకి 'వారధి' అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాస్ అప్పీల్ కోసం 'మిర్చి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
4. నిజానికి మహేష్ బాబు కోసం మిర్చి టైటిల్ ని ముందే రిజిస్టర్ చేయించారు. ఈ విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు.
5. సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ మిర్చి టైటిల్ తో మహేష్ బాబుతో సినిమా అనుకున్నారు. హేమంబర్ జాస్తి అనే కో డైరెక్టర్ ను ఇందుకు దర్శకుడిగా అనుకున్నారట. శ్రీ దుర్గా ఆర్ట్స్ పై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కాల్సింది. కానీ ఎందుకనో ఆగిపోయింది. కేఎల్ నారాయణ ఇచ్చిన అడ్వాన్స్ మహేష్ దగ్గరే ఉండడంతో ఇప్పుడు రాజమౌళి సినిమాని నిర్మించే అవకాశం ఆయనకి వచ్చింది. అలా అప్పట్లో ఈ ప్రాజెక్టు ఆగిపోవడంతో మిర్చి టైటిల్ని ప్రభాస్ కి ఇచ్చారు.
6. మిర్చి సినిమాలో ప్రభాస్ తండ్రిగా మొదట ప్రకాష్ రాజ్ ని అనుకున్నారు. కానీ అప్పటికే ఆయన బిజీగా ఉండడంతో ఆయన స్థానంలో సత్యరాజ్ ని తీసుకున్నారు.
7. ఈ సినిమా కోసం మొదట్లో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని అనుకున్నారు కానీ చివరికి దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకున్నారు. మిర్చి కోసం DSP కంపోజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
8. 2013 ఫిబ్రవరి 8న మిర్చి సినిమా రిలీజ్ అయింది. కానీ దాని కంటే ముందు సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికే సంక్రాంతి బరిలో నాయక్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు ఉండడంతో మిర్చి రిలీజ్ ని ఫిబ్రవరి కి షిఫ్ట్ చేశారు.
9. ఫిబ్రవరి నెల సినిమాలకు అన్ సీజన్ అయినా కూడా మిర్చి ఆఫీస్ వద్ద 48 కోట్ల షేర్ సాధించి ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ 
చేసింది.
10. మిర్చి సినిమా అప్పట్లోనే 238 కేంద్రాల్లో 50 రోజులు, 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: