రోమియో "ఓటిటి"విడుదలకు అంతా సిద్ధం..!

MADDIBOINA AJAY KUMAR
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈయన బిచ్చగాడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పెద్ద విజయం సాధించడంతో ఈయనకు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇక ఈ మూవీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేశారు.

పెద్దగా అంచనాలు లేకుండా తెలుగులో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన మౌత్  టాక్ ను తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ తో తెలుగు లో కూడా విజయ్ కి సూపర్ క్రేజ్ లభించింది. ఇక ఆ తర్వాత నుండి ఈయన నటించిన ప్రతి సినిమాను కూడా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. కానీ అందులో బిచ్చగాడు 2 మూవీ తప్పితే ఏ సినిమా కూడా ఈయనకు కమర్షియల్ గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందించలేదు. ఇకపోతే తాజాగా విజయ్ ఆంటోనీ , వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందిన రోమియో అనే సినిమాలో హీరోగా నటించాడు.

ఈ మూవీ తెలుగు లో లవ్ గురు అనే పేరుతో విడుదల అయింది. ఇలా తమిళ్ మరియు తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క తమిళ వర్షన్ రోమియో హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా సంస్థలు దక్కించుకున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి స్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో , ఆహా సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఇక ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: