శ్రీదేవి చివరిచూపులకు కూడా రాని తన చెల్లెలు.. ఆస్తులే కారణం..!!

murali krishna
ఒకప్పటి బాలీవుడ్ క్వీన్, టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి.. ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసింది. చైల్డ్ ఆర్టిస్టు నుండి నటిగా మారి..టాప్ హీరోయిన్ అయ్యింది.సౌత్ నుండి వెళ్లి హిందీ పరిశ్రమలో రాణిగా వెలుగొందింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఇతర భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించింది. మహిళా సూపర్ స్టార్‌గా అవతరించింది. 1963లో తమిళనాడులోని శివకాశీలో పుట్టిన శ్రీదేవికి చిన్న వయస్సులోనే బాలనటిగా మారింది. గ్యాప్ లేకుండా నటిస్తూనే హీరోయిన్ అయిపోయింది. పదేహారేళ్ల వయస్సు మూవీతో శ్రీదేవికి ఫ్లాట్ అయిపోయారు తెలుగు ఆడియన్స్. తమ అభిమాన నటిగా మార్చేసుకున్నారు. ఎన్టీఆర్, ఎన్నాఆర్, కృష్ణ వంటి సీనియర్ నటులతో పాటు వీరి తర్వాతి తరమైన చిరంజీవి, నాగార్జున వంటి యంగ్ హీరోలతో ఆడిపాడిన ఏకైక నటి శ్రీదేవినే.
సినీ ఇండస్ట్రీని ఏలేసేసిన ఈ అందాల రాణి.. 1996లో తల్లి మరణంతో కుంగిపోయింది. ఆ సమయంలోనే తనకు అండగా నిలిచిన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకుంది. వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన శ్రీదేవి.. 15 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కాగా, ఇంగ్లీష్ వింగ్లీష్ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. పులి, మామ్ వంటి చిత్రాలతో పాటు అడపాదడపా చిత్రాల్లో క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. తెలుగులో చివరిసారిగా చిరంజీవితో ఎస్పీ పరుశురామ్ చిత్రంలో నటించింది. 2018లో దుబాయ్ వెళ్లిన ఆమె అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే.
శ్రీదేవి ఆమె తల్లిదండ్రులకు ఒక్కర్తే కూతురు అనుకుంటారు కానీ.. ఆమెకు సోదరి శ్రీలత కూడా ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. శ్రీదేవిని తీసిపోని అందం ఆమె సొంతం. ఇదిగో ఈ ఫోటోలో శ్రీదేవి పక్కన ఉన్నది శ్రీలతనే. ఈ వెస్ట్రన్ దుస్తుల్లో మెరుస్తున్న బ్యూటీ ఆమెకు స్వయంగా చెల్లెలు. కానీ శ్రీలత, శ్రీదేవి చూడటానికి ఒకేలా ఉంటారు కానీ.. భిన్న అభిప్రాయాలు. శ్రీలతకు అక్క శ్రీదేవి కన్నా ముందే పెళ్లి అయ్యింది. తమిళనాడుకు చెందిన సంజయ్ రామ స్వామితో 1989లో వివాహం అయ్యింది. శ్రీదేవి తల్లి అనారోగ్య సమస్యలు ఎదురైతే.. ఓ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మరణించింది. దీనిపై నటి కేసు వేయగా.. శ్రీదేవి గెలిచింది. పరిహారంగా రూ. 7.2 కోట్లు రాగా, అందులో తనకు వాటా రావాలని శ్రీలత కోర్టు మెట్లెక్కింది. అక్కపైనే కేసు వేసి.. రూ. 2 కోట్లు దక్కించుకుంది. ఇదే వీరిద్దరి మధ్య బంధాన్ని తెంపేసింది. చివరకు అక్క మరణించిన తర్వాత చెన్నైలో జరిగిన ప్రార్థన సమావేశానికి శ్రీలత వెళ్లలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: