పవన్ ప్రచారాలు.. టీడీపీకి ప్లస్ జనసేనకి మైనస్?

Purushottham Vinay
•ఎన్నికల ప్రచారాల ఊపులో తోపుగా నిలిచిన పవన్ 

•కానీ సొంత పార్టీ విషయంలో పవన్ అట్టర్ ప్లాప్

•టీడీపీకి ప్లస్ సొంతపార్టీ జనసేనకి మైనస్ గా నిలిచిన పవన్ ప్రచారాలు


ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం లాస్ట్ స్టేజికి వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగిసి ఎన్నికల పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. ఎల్లుండి సాయంత్రానికల్లా మైకులు మ్యూట్ అవుతాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తే గనుక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ చాలా కష్టపడి చేసిన ప్రసంగాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి.ఎందుకంటే ఆయన కేవలం సొంత పార్టీ జనసేన పోటీ చేస్తున్న ప్రాంతాల్లోనే కాకుండా కూటమి సభల్లో కూడా పాల్గొని ఎన్నో ఉత్తేజ భరితమైన ప్రసంగాలు చేశారు.ముఖ్యంగా ఆయన పర్యటనలు ప్రతి చోటా ఉత్సాహభరితంగా సాగాయి. పవన్‌ కల్యాణ్‌ ఎప్పటిలాగే తన స్టైల్ లో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడి ప్రసంగాలు చేశారు. జగన్‌ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యక్తిగత సవాళ్లు కాంట్రవర్సీ క్రియేట్ చేసినా కూడా ఈ ఎన్నికల ప్రచారాల్లో మాత్రం బాగా హైలెట్ అయ్యాయనే చెప్పొచ్చు.


పవన్ కళ్యాణ్ జగన్ ని ఓడించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారాలు గమనిస్తే అర్ధం అవుతుంది. జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి.. జగన్‌ను ఓడించకపోతే.. తన పేరు పవన్‌ కల్యాణే కాదు.. తన  పార్టీ జనసేనే కాదు అంటూ పవన్‌ కళ్యాణ్ ఊగిపోతూ చేసిన ప్రసంగాలు బాగా హైలైట్ అయ్యాయనే చెప్పాలి.పవన్ కళ్యాణ్ ఒక పక్క తాను పోటీ చేస్తున్న పిఠాపురంపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తూ మరో వైపు ఇతర ప్రాంతాల్లో కూడా హుషారుగా ప్రచారాలు చేస్తూ పర్యటించారు. కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలకు పవన్ హాజరవ్వడం హైలైట్. మోడీ, అమిత్‌ షా హాజరైన సభలకు కూడా పవన్‌  కల్యాణ్ హాజరయ్యారు. ఇక లాస్ట్ స్టేజిలో విజయవాడలో మోదీతో రోడ్‌షోలో పాల్గొన్నారు.


అయితే ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ వందకి వెయ్యి శాతం సక్సెస్ అయ్యారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. కానీ అసలైన విషయంలో ఫెయిల్ అయ్యారు. నిజానికి పవన్ పడ్డ కష్టానికి ఆయనకి 20 సీట్లు చాలా తక్కువనే చెప్పాలి. ఆయన ప్రచారాలు టీడీపీకి బాగా ఉపయోగపడ్డాయే తప్ప తన సొంత పార్టీకి మాత్రం ఉపయోగపడలేదు. ఇంకా ఆయన తీరు సొంత పార్టీకి మైనస్ అయ్యింది. పార్టీ కోసం కష్టపడ్డ సొంత అభ్యర్థులకు వారి కష్టానికి తగ్గ ఫలితం లేక పార్టీ నుంచి తొలగిపోయారు. తన కోసం కష్టపడ్డ వారు, తనని నమ్ముకున్న వారి విషయంలో పవన్ అట్టర్ ఫెయిల్ అయ్యారు. ఆయన ప్రచార పదనిసలు సొంత పార్టీ కంటే టీడీపీకే బాగా ఉపయోగపడ్డాయి. ఈ విషయంలో పవన్ అట్టర్ ప్లాప్ అయ్యారు. ఇక పవన్ పడ్డ కష్టానికి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: