ఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ "కొండా"..!

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం ఇండియా లోనే అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగించిన వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఈయన నాగార్జున హీరోగా రూపొందిన శివ సినిమాతో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఈ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన కొంత కాలానికే హిందీ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించాడు. అందులో భాగంగా ఈయన ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లను హిందీ లో రూపొందించి అక్కడ కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
 

ఇలా కెరియర్ ప్రారంభంలో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన విజయాలను అందించిన ఈయన ఈ మధ్య కాలంలో మాత్రం ఘోర పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. దానితో ఈయన సినిమాలు వచ్చిన విషయం కూడా పెద్దగా ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ కొంత కాలం క్రితం కొండా అనే సినిమాను తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కొండా సుష్మిత పటేల్ నిర్మించింది. ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇక చాలా రోజుల తర్వాత ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ ప్రస్తుతం బీసీఐ నీట్ అనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv

సంబంధిత వార్తలు: