"కృష్ణమ్మ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగులో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించాడు . ఈ మూవీ అదిరిపోయే యాక్షన్ డ్రామాగా రూపొందింది . ఈ మూవీ కి వి వి గోపాల కృష్ణ దర్శకత్వం వహించగా ... తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి కొరటాల శివ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు . ఈ మూవీ మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది.
 

ఈ చిత్ర విడుదల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ వారు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేశారు. ఇక సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇక ఈ మూవీ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాని సమర్పిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకు గనుక బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ వచ్చినట్లు అయితే మంచి కలెక్షన్ లను ఈ మూవీ రాబట్టే అవకాశం ఉంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: