ఏపీ: ముగ్గురు నేతలపై భారీ బెట్టింగ్.. గెలవడం కష్టమేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే పోలింగ్ పూర్తి అయి వారం కావస్తోంది.. అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత ఏపీలో చాలా ప్రాంతాలలో అల్లర్లు, గొడవలతో ఒక యుద్ధ వాతావరణమే కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో కూడా చాలామంది నేతల మీద బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ముగ్గురు నేతలపైన భారీ బెట్టింగ్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారు ఎవరో కాదు లోకేష్, షర్మిల ,రఘురామ కృష్ణంరాజు. ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారని , ఓడిపోతారని చాలామంది బెట్టింగ్ కడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ముగ్గురి పైన వైసిపి నేతలు మాత్రం ఈ ముగ్గురిలో ఎవరు కూడా గెలవడం చాలా కష్టమే అన్నట్లుగా తెలియజేస్తున్నారు.. నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయగా రఘురామ కృష్ణంరాజు ఉండి నుంచి పోటీ చేస్తున్నారు.. అలాగే షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురి నేతలలో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయో వ్యతిరేకంగా వస్తాయో తెలియదు కానీ బెట్టింగ్లో మాత్రం టాప్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో ఇద్దరు నేతలు గెలవడం కోసం భారీగానే ఖర్చు చేసినట్లుగా సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాలలో కూడా ఈ ముగ్గురి నేతల మీద భారీ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటివరకు నారా లోకేష్, షర్మిల ఎన్నికలలో గెలిచిన చరిత్ర అసలు కనిపించలేదు రఘురామ కృష్ణంరాజు గత ఎన్నికలలో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత జగన్ పైన విమర్శలు చేసి టిడిపి పార్టీలోకి చేరారు. లోకేష్ గత కొన్నేళ్లుగా తాను నిలబడ్డ మంగళగిరిలో గెలుపు కోసం చాలానే కష్టపడుతున్నారు. మరి ఆయన కష్టానికి ఫలితం వస్తుందో రాదో చూడాలి.. సోషల్ మీడియాలో ఈ ముగ్గురి నేతల గురించి హాట్ టాపిక్ గా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: