మళ్లీ అలాంటి ప్లాన్ చేస్తే "బిగ్ బాస్" టిఆర్పి కి పెద్ద షాక్ తగిలే ఛాన్స్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగులో అద్భుతమైన క్రేజ్ కలిగిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం వినకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఈ షో పై ఎప్పుడు అనేక నెగటివ్ కామెంట్స్ వచ్చినా కూడా షో మొదలు అయ్యింది అంటే చాలు టి ఆర్ పి రేటింగ్ అద్భుతమైన స్థాయిలో వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ 7 బుల్లితెర , ఒక ఓ టి టి సీజన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఇందులో బిగ్ బాస్ బుల్లి తెర ఆరోవ సీజన్ కి మినహాయిస్తే అన్ని సీజన్లకి కూడా అద్భుతమైన టి ఆర్ పి రేటింగ్ దక్కింది. 
ఆరవ సీజన్ కి టి ఆర్ పి రేటింగ్ తగ్గడానికి ప్రధాన కారణం గతంలో ఐదు బుల్లితెర మరియు ఒక ఓ టి టి సీజన్ కి ఎలాంటి కాన్సెప్ట్ ను ఫాలో అయ్యారు ఆరోవ సీజన్ కి కూడా అదే కాన్సెప్ట్ ను ఫాలో కావడంతో ఆరవ సీజన్ కి టి ఆర్ పి రేటింగ్ భారీగా తగ్గింది. దానితో ఆలోచనలో పడ్డ బిగ్ బాస్ బృందం ఏడవ సీజన్ కి ఉల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకు వచ్చింది. అలాగే కొత్త గేమ్స్ ను కూడా తీసుకువచ్చింది.

దానితో ఏడవ సీజన్ కి మళ్ళీ అద్భుతమైన టి ఆర్ పి రేటింగ్ దక్కింది. ఇకపోతే ఏడవ సీజన్ కి అద్భుతమైన టి ఆర్ పి రేటింగ్ వచ్చింది కాబట్టి ఎనిమిదవ సీజన్ కి కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యి గేమ్ షో లను అదే ఉల్టా పల్టా పద్ధతిని ఫాలో అయినట్లు అయితే ఈ సీజన్ కు తక్కువ టి ఆర్ పి రేటింగ్ వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి బిగ్ బాస్ బృందం ఈ సారి ఏదైనా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: