వైసీపీలో అల్లుడు చాఫ్ట‌ర్ క్లోజ్‌.. ఇక మామ క‌థే మిగిలి ఉందా..?

RAMAKRISHNA S.S.
వైసీపీలో అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఆ మామ అల్లుళ్లు రాజ్యం మామూలుగా లేదు. పార్టీలో ఎంతోమంది మహామహులు ఉన్న ఆ మామ అల్లుళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అల్లుడుగారు పార్టీకి అదిరిపోయే షాక్ ఇచ్చారు .. పార్టీకి రాజీనామా చేసేశారు. అల్లుడు వంతు అయిపోయింది .. ఇప్పుడు మామగారు రూట్ ఎటువైపు ? అన్నదే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకు ఆ మామ అల్లుడు ఎవరు ? అనుకుంటున్నారా ? వైసీపీ సీనియర్ నేత ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తాజా మాజీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశ‌య్య.

వాస్తవానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కు జగన్ మంచి ప్రయారిటీ ఇచ్చారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మారెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇక రావి వెంకటరమణ లాంటి బలమైన నేత ఉన్నా కూడా 2019 ఎన్నికల్లో ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు కిలారు వెంకట రోశ‌య్యకు పొన్నూరు సీటు ఇచ్చారు. కేవలం ఉమ్మారెడ్డి చక్రం తిప్పి తన అల్లుడికి పొన్నూరు సీటు ఇప్పించుకున్నారు. ఐదేళ్లు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న రోశయ్య ఈ ఎన్నికలలో అక్కడ నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. అయితే జగన్ బలవంతంగా రోశయ్యకు ఇష్టం లేకపోయినా గుంటూరు పార్లమెంటుకు పంపి అక్కడ పోటీ చేయించారు.

ఈ ఎన్నికలలో రోశయ్య ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్రశేఖర్ చేతిలో ఏకంగా మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఈ దారుణ ఓటమి తర్వాత రోశయ్య వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అల్లుడు పార్టీ నుంచి బయటికి వచ్చేసాడు.. ఇక ఇప్పుడు మామ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కూడా అదే బాటలో నడుస్తారా ? ఆయన కూడా పార్టీలో జరుగుతున్న అవమానాలు నేపథ్యంలో బయటకు వచ్చేస్తారా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లోనే నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: