తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డికి.. ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా?

praveen
మనదేశంలో క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ క్రికెట్ ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు క్రీడాభిమానులు. ఈ క్రమంలోనే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కూడా క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక స్టార్ క్రికెటర్లందరినీ కూడా దేవుళ్ళ లాగా ఆరాధించే క్రికెట్ ప్రేక్షకులు కూడా మన దేశంలో కనిపిస్తూ ఉంటారు.

అయితే ఇక బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగానే నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇక ఎంతోమంది యువ క్రికెటర్లకు కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఒకప్పుడు భారత జట్టులో ఆడి మంచి పరుగులు చేసి స్టార్ ప్లేయర్ గా రాణిస్తేనే గుర్తింపు వచ్చేది. కానీ ఇప్పుడు ఐపీఎల్ లో రాణిస్తే చాలు టీమిండియా తరఫున ఆడకపోయినా ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు ఎంతోమంది. ఇక అలాంటి యువ ఆటగాళ్ల గురించి ఏ విషయం ఇంటర్నెట్లోకి వచ్చిన వైరల్ గా మారిపోతుంది.

 అయితే ఐపీఎల్ సీజన్ లో తెలుగు టీం అయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతూ విరోచితమైన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. అతనికి ఊహించని రీతిలో పాపులారిటీ పెరిగిపోయింది. అతని గురించి ఏ విషయం వెలుగులోకి వచ్చిన వైరల్ గా మారిపోతుంది. అయితే ఇటీవల ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు ఈ తెలుగు ప్లేయర్. అభిమానుల చేత కింగ్ గా పిలుచుకునే విరాట్ కోహ్లీనే తన ఫేవరెట్ అంటూ తెలిపాడు. ఇక ఫుట్బాల్ లో క్రిస్టియానో రోనాల్డో కి తాను పెద్ద అభిమానిని అంటూ నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. కోహ్లీ, రోనాల్డో అత్యుత్తమ ప్లేయర్లు. మైదానంలో విజయం కోసం 100% కృషి చేస్తారు. వారెప్పుడూ స్థాయికి మించిన ప్రదర్శన చేయాలనుకుంటారు. మైదానంలో నేను కూడా అదే చేస్తూ ఉంటాను. వారి నుంచి ఎంతో ప్రేరణ పొందాను అంటూ నితీష్ కుమార్తె చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: