నాగ వంశీ అందుకే అలాంటి కామెంట్స్ చేశాడా... ఆ సినిమా విడుదల వాయిదా పడినట్లేనా..?

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాతగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన ఇప్పటికే సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనేక సినిమాలను నిర్మించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం కూడా ఈయన అనేక సినిమాలను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ , దుల్కర్ సల్మాన్ హీరో గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే సెప్టెంబర్ 27 వ తేదీన పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి మూవీ ని కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

ఓజి మూవీ విడుదల అనుకున్న తేదీనే లక్కీ భాస్కర్ విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇదే విషయంపై నాగ వంశీ కొంత మంది మీడియా మిత్రులు పవన్ కళ్యాణ్ "ఓజి" సినిమా విడుదల ఉన్న తేదీనే మీరు లక్కీ భాస్కర్ మూవీ ని విడుదల చేస్తున్నారు అని అడగ్గా ... నేను ఆయన సినిమా విడుదల ఉంటే నేనేందుకు నా సినిమాను విడుదల చేస్తాను ... అన్నారు. దానితో ఓజి సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యిందా అని అడగగా ... నాకు ఆ విషయం తెలియదు అని సమాధానం ఇచ్చాడు.

ఇక ఈయన సమాధానం ప్రకారం ఓజి మూవీ విడుదల వాయిదా పడిన విషయం నాగ వంశీ కి తెలియడంతోనే లక్కీ భాస్కర్ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు అనేక మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nv

సంబంధిత వార్తలు: