వైసిపి: గెలుపు కన్ఫాం అయినట్టేనా.. విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే..?

Divya
ఏపీలోని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన పూర్తి కాక జూన్ 4వ తేదీన ఫలితాలు వెలుబడునున్నాయి. ఈ సందర్భంగా చాలా మంది విశ్లేషకులు ఎంతోమంది అంచనాలు వేసి ధీమా తెలియజేయడమే కాకుండా, నమ్మకాలు, జోస్యాలు   సైతం ఆంధ్ర ప్రదేశ్ ఫలితాల పైన విపరీతంగా చర్చ నడిపిస్తున్నారు. ఈ సమయంలోనే మిగతా వారితో పోలిస్తే వైసిపి పార్టీ ధీమా మరింత పీక్స్ లో ఉందని పరిశీలకులు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలకులు కూడా ఒప్పుకుంటున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి రాబోయే ఫలితాల పైన తీవ్ర ఉత్కంఠత సైతం మొదలయింది.

అయితే పోలింగ్ రోజు తెరపైకి వచ్చిన కొన్ని కీలక పరిణామాలు వైసిపి పార్టీ గెలుపుకు సంకేతం అన్నట్లుగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా పోలింగ్ రోజు ఉదయాన్నే అత్యధిక సంఖ్యలో వృద్ధులు మహిళలు సైతం పోలింగ్ బూత్ వద్ద క్యూ కట్టారని తెలుస్తోంది. ఫలితాలు రికార్డు స్థాయిలో కూడా నమోదు అవ్వడం జరిగింది. అయితే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని పలువురు బ్రమపడిన మరికొంతమంది ఇది జగన్ ప్రో ఓటే అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.అందుకే వైసిపి అంత ధీమాతో ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు.

పైగా వైసీపీకి వ్యతిరేక వర్గంగా ముద్రపడిన మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.అందుకే వైసీపీ ప్రభుత్వమే కొలువు దీరబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా వినిపిస్తున్న విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో సుమారుగా 95% పైగా హామీలు అమలు చేశామని ఈ విషయాన్ని జగన్ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకువెళ్లారు. అయితే ఈ విషయాలను ప్రజలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి జగన్ ని నమ్మారని ఈ స్థాయిలో పాజిటివ్ పొలిటికల్స్ చేయడం సరికొత్త పరిణామాలకి దారితీస్తోంది అంటూ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జగన్ చెప్పాడు అంటే చేస్తాడనే పేరు కూడా వినిపించింది. మరి విశ్లేషకులు మాట నిజం అవుతాయో లేదో నాలుగో తేదీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: