ఆ విషయంలో టాప్ 6 లో నిలిచిన పుష్ప సెకండ్ సింగిల్..!

MADDIBOINA AJAY KUMAR
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ లోని రెండవ పాట అయినటువంటి సూసేకి అంటూ సాగే పాటను రెండు రోజుల క్రితం మూవీ యూనిట్ విడుదల చేసింది.

ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ తెలుగు సినీ పరిశ్రమ నుండి ఇప్పటి వరకు విడుదల అయిన పాటలలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సాంగ్స్ లిస్టులో 6 వ స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం మూవీ లోని దమ్ మసాలా సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 17.42 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ఆ తర్వాత మహేష్ హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని పెన్ని సాంగ్ కి 24 గంటల్లో 16.38 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ కి 24 గంటల్లో 14.78 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమా లోని మా మా మహేశా సాంగ్ కి 24 గంటల్లో 13.56 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ఈ సాంగ్ తర్వాత అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ లోని ఊ అంటావా సాంగ్ కి 24 గంటల్లో 12.39 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇక ఈ సాంగ్ తర్వాత తాజాగా విడుదల అయిన పుష్ప పార్ట్ 2 మూవీ లోని సూసైకి సాంగ్ కి 24 గంటల్లో 10.97 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని 6 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: