ఏపీ: టీడీపీని మహిళలు మరోసారి ముంచేసారా..??

Suma Kallamadi
మహిళలు అన్ని విషయాలలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అంటారు. అది అక్షర సత్యం. ఇక ఎన్నికలకు కూడా ఈ మాటను అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మహిళలు ఓటు వేసిన వారే ఎలక్షన్స్ లో గెలుపొందుతారు. మోదీ మంచి ఏపీ సీఎం జగన్ వరకు ఎంత తోపు నాయకుడైనా సరే ఆడవారి ఓట్లు లేకపోతే గెలవడం అనేది అసాధ్యం. ఒక నాయకుడి గెలుపోటములు వారి చేతుల్లోనే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ నిజాన్ని రాజకీయ నాయకులు బాగా తెలుసుకున్నారు. అందుకే మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.
 మహిళలందరి ప్రాధాన్యతలు ఇష్టాయిష్టాలు ఒకేలా ఉంటాయని కాదు కానీ కామన్ గా వారికి నచ్చే పనులు చేస్తే వారి ఓట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. పోయినసారి పసుపు కుంకుమ పేరిట చంద్రబాబు ఒక్కో మహిళకు పదివేల చొప్పున డబ్బులు అందజేశారు. అలా డబ్బులు ఇచ్చారో లేదో మహిళలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అర్ధరాత్రి వరకు ఉండి మరీ ఓట్లు వేశారు. కానీ వాళ్లు చంద్రబాబుకు ఓటు వేయలేదు. జగన్ కి ఓటు వేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారు. పసుపు కుంకుమ వర్కౌట్ అయిందని చంద్రబాబు చంకల గుద్దుకుంటూ గెలుపు తనదే అనుకున్నారు కానీ అప్పుడు మాత్రం ఆయనను మహిళలు ముంచేశారు.
ఇప్పుడేమో జగన్ కూడా మహిళల ఓట్లు తమకే పడతాయని అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందజేశాం కాబట్టి తనకే మహిళల ఓట్లన్నీ పడి ఉంటాయని ఆయన భావిస్తున్నారు. మహిళల మనసుల్లో ఏముందో ఎవరూ గ్రహించలేరు. జగన్ కూడా ఈసారి జరుగుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరూ ప్రస్తుతానికైతే చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 8.4 లక్షల మహిళల ఓట్లు చేరాయి. చాలామంది మహిళలు బ్యాంకు అకౌంట్స్ కూడా తెరిచారు. వారికి జగన్ డబ్బులు ఇచ్చారు. ఒక సాధికారత లాంటిది సాధించారు. ఈ మహిళలందరూ జగన్ కి ఓటు వేసి ఉండవచ్చు. కానీ వారు చంద్రబాబు ప్రలోభాలకు గురయ్యారా? లేకపోతే చంద్రబాబును పోయినసారి లాగానే ఎప్పటికీ నమ్మకూడదని నిర్ణయించుకున్నారా? ఆయనను మరోసారి ముంచేసారా? అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP

సంబంధిత వార్తలు: