విజయ్ నెక్స్ట్ మూడు మూవీస్ ఇవే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... గోపీ చందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు. ఆ మూడు మూవీ లు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.
ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది. ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణలో ఉన్న సమయం లోనే విజయ్ మరో రెండు మూవీ లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రి మూవీ సంస్థలో విజయ్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది. ఇక ఇప్పటికే విజయ్ , రాహుల్ కాంబో లో టాక్సీవాలా అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకుంది. ఇక వీరి కాంబో లో రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: