నన్ను బ్యాన్ చేయాలని చూస్తున్నారు... పాయల్ రాజ్పుత్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటీమణులలో పాయల్ రాజ్పుత్ ఒకరు. ఈమె 2018 వ సంవత్సరం విడుదల అయినటువంటి ఆర్ ఎక్స్ 100 మూవీ తో అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ హీరో గా నటించాడు. ఇక కార్తికేయ కు అజయ్ భూపతి కి కూడా ఇదే మొదటి మూవీ కావడం విశేషం.

ఈ సినిమాలో ఈమె తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకుల మతి పోగొట్టింది. దానితో ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు లభించాయి. కొన్ని రోజుల క్రితమే ఈమె మంగళవారం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇందులో కూడా ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనను బ్యాన్ చేయాలి అని కొంత మంది ప్రయత్నిస్తున్నట్లు ఓ పోస్ట్ చేసింది.

ఆ పోస్ట్ వివరాలను తెలుసుకుందాం. 2019 సంవత్సరం నేను రక్షణ అనే ఓ మూవీ లో నటించాను. నాకు రీసెంట్ గా సూపర్ క్రేజ్ రావడంతో ఇప్పుడు ఆ సినిమాను రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నాకు రెమ్యూనిరేషన్ కూడా వారు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ చేయాలి అని ఒత్తిడి చేస్తున్నారు. ప్రమోషన్స్ కు రాకపోతే నన్ను బ్యాన్ చేస్తామన్నారు. ఈ మూవీ లో నా పేరు , పాత్ర ఉంటే చట్ట పరమైన చర్యలు తప్పవు అని ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం కూడా పాయల్ రాజ్పుత్ చాలా సినిమాలలో నటిస్తూ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: