విజయశాంతి: అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్.. "ఒసేయ్ రాములమ్మ"తో తెలుగు ఇండస్ట్రీ షేక్.!
- హీరోలతో సమానంగా చేసిన లేడీ సూపర్ స్టార్..
- రాములమ్మ నీకు ఎవరూ సాటి లేరమ్మ..
విజయశాంతి..ఈమె పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది లేడీ ఓరియంటెడ్ పాత్రలే. అప్పట్లో ఉండేటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో సమానంగా ఉండే పాత్రల్లో నటించి అద్భుతమైనటువంటి పేరు సంపాదించింది. అలాంటి రాములమ్మ చేసినటువంటి చిత్రాలలో ఆమెకు సూపర్ హిట్ అందించి ఎంతో పేరు తీసుకొచ్చిన మూవీ ఒసేయ్ రాములమ్మ.. ఇదే కాకుండా ప్రతిఘటన మూవీ కూడా విజయశాంతిని హీరోయిన్ గా నిలబెట్టిందని చెప్పవచ్చు.. అలాంటి విజయశాంతి తన కెరియర్ లో ఎలాంటి ఇబ్బందులు పడింది ఆ వివరాలు ఏంటో చూద్దాం..
15 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న విజయశాంతి. తన పిన్ని దగ్గర ఉంటూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఎన్నో కష్టాలు పడుతూ సినిమాల్లో నటిస్తూ చివరికి హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఎదిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎంతోమంది పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నామని చెబుతారు. కానీ అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసి అధరహో అనిపించిన హీరోయిన్ విజయశాంతి. అలాంటి విజయశాంతి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాల్లో ఒసేయ్ రాములమ్మ కీలక స్థానం పోషించింది. మరి ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చూద్దాం.. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చినటువంటి మూవీ ఒసేయ్ రాములమ్మ.. ఈ సినిమా గురించి మనం ఒక్క మాటలో చెప్పలేం. సాధారణంగా ఒక సినిమా వస్తుంది అంటే మాస్ లేదా కామెడీ లవ్ ఇలా ఏదో ఒక యాంగిల్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించినటువంటి మూవీ ఒసేయ్ రాములమ్మ. అద్భుతమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే హంగులతో ఈ చిత్రం థియేటర్లోకి వచ్చి ఆ రోజుల్లోనే రికార్డులు బద్దలు కొట్టింది. చరిత్రను తిరగరాసింది..