పవన్ కల్యాణ్ టీంలోకి ఆమ్రపాలి..?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకనుంచి పనిచేయనున్నారు ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి. మొన్నటి వరకు తెలంగాణలో హల్చల్ చేశారు ఈ మహిళ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి. అయితే కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు... ఏపీకి తరలి వెళ్ళిపోయారు. ఆమ్రపాలి తో పాటు మరో పదకొండు మంది ఐఏఎస్ అధికారులు తెలంగాణ రాష్ట్రం ను... వదలాల్సి వచ్చింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో అమ్రాపాలి చాలా వరకు సేవలు అందించారు.

తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు అయినప్పుడు... అంటే కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు.. వరంగల్ కలెక్టర్ గా.. బాధ్యతలు చేపట్టారు ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి.  కానీ ఆ తర్వాత.. అమ్రపాలిని పెద్దగా పట్టించుకోలేదు కేసీఆర్. కేవలం స్మిత సబర్వాల్ కు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. స్మిత సబర్వాల్ చేపట్టిన కార్యక్రమాలు నచ్చిన కేసీఆర్.. ఆమ్రపాలిని  పెద్దగా పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

స్మిత సబర్వాల్ ను రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన... ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఆమెకు నాలుగు శాఖల అప్పగించారు. అలాగే ఇటీవల జిహెచ్ఎంసి కమిషనర్ గా కూడా ఆమ్రపాలి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ పోస్టులో కూడా ఆమ్రపాలి బాగానే పనిచేయడం జరిగింది.

ఇంతలోనే ఆమ్రపాలితో పాటు మరో పదకొండు మంది అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎక్కడి వాళ్ళు అక్కడికే వెళ్లాలని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆమ్రపాలిని పంపించేసింది కేంద్రం. దీంతో.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు ఆమ్రపాలి. అయితే తెలంగాణలో కీలకంగా ఉన్న అమరపాలికి చంద్రబాబు నాయుడు కీలక పదవి ఇవ్వబోతున్నారని సమాచారం. ఆమెకు రెండు నుంచి మూడు శాఖలు అప్పగించడమే కాకుండా... విశాఖపట్నం కార్పొరేషన్ కమిషనర్ గా కూడా బాధ్యతలు ఇవ్వనున్నారట. లేదా పవన్‌ కళ్యాణ్‌ టీంలో ఆమె వెళ్లనున్నారట. ఈ మేరకు చర్చ జరుగుతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: