ఏపీ: శిష్యుడి చేతిలో గంటాకు ఓటమి తప్పదా..?

Divya
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు ఈసారి గెలవడం కష్టమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భీమిలి ఫలితం పై తర్జనభజన వినిపిస్తోంది. వాస్తవానికి 2019 వైసీపీ నేతలు కూడా తెలియజేస్తున్నారు. 2019 విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయగా స్వల్ప ఓట్ల తేడాతో బయటపడ్డారు.. బిమిలో నుంచి రెండోసారి పోటీ చేసేందుకు గంటా ఇప్పుడు ప్రయత్నించారు.. 2014 నాటి సానుకూలత ఫలితాలు ఇప్పుడు కనిపించడం లేదు.. పోలింగ్ అనంతరం వైసిపి శిబిరం వేసుకున్న లెక్కల అంచనాల ప్రకారం గంటాకు ఓటమి తద్యమని చెబుతున్నారు. ముఖ్యంగా గంటాకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు గట్టి పోటీ ఇచ్చారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అవంతికి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నుంచి కూడా మంచి సహకారం ఉండడం చేత అలాగే బొత్స భార్య ఝాన్సీ కూడా విశాఖ ఎంపీ పోటీ చేయడం చేత మూడున్నర లక్షల ఓట్లతో భీమిలో అతిపెద్ద అసెంబ్లీగా ఉన్నది. ముఖ్యంగా భీమిలిలో తూర్పు కాపులు ఓసి కాపులు చాలా ఎక్కువమంది ఉండడంతో గంటా ను సైడ్ చేసి మరి వైసీపీకి ఓటు వేసేలా బొత్స చక్రం తిప్పారని కూడా తెలుస్తోంది. వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు కూడా వైసీపీ పార్టీకే పడ్డాయని తెలుస్తోంది.

ముఖ్యంగా బొత్స పండిన వ్యూహంలో గంటా చిక్కుకున్నారని దీంతో అటు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడంలో సక్సెస్ అవుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు తన గెలుపు కూడా ఖచ్చితమని ధీమాని వ్యక్తం చేస్తున్నారు. దీంతో బొత్స వర్సెస్ గంటా అనే విధంగా భీమిలిలో ఎన్నికలు జరిగాయని ఇందులో బొత్స కూడా తన వ్యూహాలతో గంటాను కట్టుదిట్టం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. గంటాకి మొదటిసారి ఓటమి శిష్యుడు చేతుల్లో ఎదురవుతుందనే విధంగా వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: