సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ నయా రికార్డ్

Anilkumar
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో భారీ పాపులారిటీని అందుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ యంగ్ హీరో. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజుకి పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో మరో మైలురాయిని అందుకున్నాడు.విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని 

సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అలా అందరు హీరోల కంటే ఎక్కువ పాపులారిటీని సోషల్ మీడియా ద్వారా సొంతం చేసుకున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే 20 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న విజయ్ దేవరకొండ కి మరో మిలియన్ ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ సంఖ్య 21 మిలియన్ కి చేరుకుంది. ఈ ల్యాండ్ మార్క్ తో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 24 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నారు. విజయ్ సరికొత్త ఫీట్ పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఈ రేర్ ఫీట్ తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని వెనక్కి నెట్టాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ని రోజులు బన్నీ తర్వాతి స్థానంలో చరణ్ 20.6 మిలియన్ల ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉండగా.. 21 మిలియన్ల ఫాలోవర్స్ తో విజయ్ దేవరకొండ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోని ఇంత తక్కువ సమయంలో వెనక్కి నెట్టడం అంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి రౌడీ హీరో డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: