బలగం డైరెక్టర్, నాని సినిమాకి టైటిల్ ఫిక్స్.. ఏంటంటే..!?

Anilkumar
తాజాగా హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని. దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మాస్ మసాలా కంటెంట్ తో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని ఎందుకుందో తెలిసిందే. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. శౌర్యవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ  సినిమా ఊహించిన విధంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సైతం అందుకుంది.

ఎమోషనల్ డ్రామా గా వచ్చిన ఈ  సినిమాలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ విజయాలను అందుకున్న నాని ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాని నటిస్తున్న నయా మూవీస్ లో సరిపోదా శనివారం ఒకటి ఈ కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఇద్దరు గతంలో అంటే సుందరానికి అనే చేశారు. ఈ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి సాలిడ్ హిట్ కొట్టాలని కసిమీద ఉన్నారు. ఇదిలాఉంటే నాని మరో సినిమా ను కూడా ఓకే చేశాడు.

లగం తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు డైరెక్షన్ లో చేస్తున్నాడు నాని. ఇప్పటికే ఈ సినిమా  గురించి చాలా రకాలా వచ్చాయి. వేణు బలగం సినిమా తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు నాని ని డైరెక్ట్ చేస్తున్నాడు వేణు. ఈ సినిమా కు ఓ ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. నాని , వేణు సినిమా కు ఎల్లమ్మ అనే టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో ఎల్లమ్మ అనే దేవత ఉంది. ఆ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: