మాట తప్పుతున్న అల్లు అర్జున్!!

Anilkumar
ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనేదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బన్నీ లైనప్ లో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. కానీ ఎవరితో సినిమా చేస్తాడనేది క్లారిటీ లేదు. గత కొన్నాళ్లుగా బన్నీ డైరెక్టర్స్ విషయంలో మాట తప్పుతున్నాడని వాదనలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బన్నీ డైరెక్టర్స్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే ఇది నిజమే అనిపిస్తుంది.

ఇప్పటికే చాలామంది దర్శక నిర్మాతలతో సినిమా చేస్తానని చెప్పి మాటతప్పినట్లు స్పష్టం అవుతుంది. ఇక గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కబోయే నాలుగో సినిమా ఆగిపోతుంది అనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బన్నీ డైరెక్టర్స్ విషయంలో మాట తప్పుతున్నాడని అంటున్నారు. విచిత్రం ఏంటంటే, సదరరు  దర్శకులతో బన్నీ కమిట్ అవుతున్న సినిమాలన్నీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన తర్వాతే క్యాన్సిల్ చేయబడుతున్నాయి. 2017 లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కంటే ముందు అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ లింగస్వామి తో

సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ నిర్మిస్తుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత బన్నీ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో 'ఐకాన్' అనే ప్రాజెక్ట్ చేసేందుకు కమిట్ అయ్యాడు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా అల్లు అర్జున్ తన ట్యాగ్ స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మార్చుకున్నాడు. కట్ చేస్తే.. ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. పుష్ప కంటే ముందు యువ సుధా ఆర్ట్స్, GA2 పిక్చర్స్ కింద స్టార్ డైరెక్టర్ కొరటాల శివ -అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమాని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: