ఏంటి.. వెంకటేష్ 'సైంధవ్'లో.. ఆయన పాత్రకు రూ.8 కోట్లు ఇచ్చారా?

praveen
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సీద్ధికి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన నటనకు నిలువెత్తు రూపం అని సినీ విశ్లేషకులు కూడా అభివర్ణిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడు వైవిద్యమైన పాత్రలు చేస్తూ తను నటనతో ఆకట్టుకుంటాడు ఈ బాలీవుడ్ స్టార్. ఇతర హీరోల సినిమాల్లో ఎలాంటి పాత్ర చేయడానికి అయినా రెడీ అవుతూ ఉంటాడు అని చెప్పాలి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు ప్రాణం పోయ గల సత్తా అతనికి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నవాజుద్దీన్ సిద్ధికి ఇక వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమాలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.

 అయితే నవజుద్దీన్  లాంటి ఒక గొప్ప నటుడు తెలుగులో  మొదటి సారి నటిస్తున్నాడు అంటే అందరి అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి తోడు విలన్ పాత్రలో చేస్తున్నాడు అంటే ఇక హీరోని వదిలేసి మరి ఇక ఇతన్ని చూస్తూ ఉంటారు కొంతమంది ప్రేక్షకులు. అయితే సైంధవ్ సినిమాలో ఇలాంటి నమ్మకంతోనే మేకర్స్ జట్టులోకి తీసుకున్నారు. కానీ ఆయన ఈ మూవీ కోసం చేసింది ఏమీ లేదు. నిజంగా ఈ సినిమాలో నవజుద్దీన్ సిద్దికేనే నటించాడా అని ప్రతి ఒక్కరు కూడా అనుమానపడే విధంగా ఇక సైంధవ్ లో అతని నటన ఉంది అని చెప్పాలి

 ఈ మూవీలో విలన్ పాత్ర చేసినందుకుగాను ఏకంగా అతనికి ఎనిమిది కోట్ల పారితోషికం ఇచ్చారని ఒక టాక్ ఉంది. కానీ అతని నటనకు అంత భారీ మొత్తం కూడా ఇచ్చి వృధా చేశారు అంటూ ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. అయితే నిజానికి అతనికి సౌత్ సినిమాల్లో నటించడం ఇష్టం లేదట. భాష రాకపోవడమే ఇందుకు కారణమట. అయితే సంభాషణలు అర్థం చేసుకోలేక పోతే పాత్రలో లీనం అవ్వడం కష్టం అనేది నవాజూద్దీన్ ఉద్దేశం. అలాంటిది ఇక అతని బతిమిలాడి మరి ఈ సినిమా కోసం ఒప్పించారట. చివరికి 8 కోట్లు ముట్ట చెప్పారట. కానీ ఏ మాత్రం క్యారెక్టర్ కు న్యాయం చేయలేకపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: