మహేష్ ను కూడా వదలని జక్కన్న.. ఆ కండిషన్స్ పెట్టాడట.. వామ్మో చాలా కష్టం గురూ?

praveen
సాధారణంగా స్టార్ హీరోలకు అనుకూలంగా ఉండే విధంగానే డైరెక్టర్లు ప్రతి సీన్ ను చిత్రీకరిస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలకు కోపం వచ్చిందంటే చాలామంది డైరెక్టర్లు భయపడిపోతూ ఉంటారు. కానీ అలాంటిది ఏకంగా స్టార్ హీరోలతో సైతం కంట్రోల్ లో పెట్టి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి మాత్రమే అని చెప్పాలి. ఇక రాజమౌళితో సినిమా అంటే హీరోలు ఎంతలా ఇష్టపడతారో.. అంతే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా తీస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవచ్చు. అందుకే ఇష్టపడతారు. కానీ రాజమౌళి పెట్టే కండిషన్స్ కి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఎవరైనా హీరో ఒక్కసారి రాజమౌళితో సినిమా కమిట్ అయ్యాడు అంటే చాలు ఆ సినిమా పూర్తి అవ్వడానికి ఎన్నేళ్లు అయినా సరే ఇక మరో సినిమా చేయడానికి జక్కన్న అస్సలు అనుమతి ఇవ్వడు. ఇక తన సినిమా కోసమే ప్రత్యేకంగా హెయిర్ స్టైల్, బాడీ షేపింగ్ అని కూడా మార్చుకోమని అటు హీరోలకి ఆర్డర్లు వేస్తూ ఉంటాడు రాజమౌళి. అయితే ఇక ఇప్పుడు మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. మొదటిసారి వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఇక ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే మహేష్ బాబుకు జక్కన్న కొన్ని కండిషన్స్ పెట్టాడట. మార్చి నుండి మహేష్ బాబు ఎక్కడ బయట కనిపించకూడదట. యాడ్ షూట్స్ లో కూడా పాల్గొనదట.. ఎందుకంటే మహేష్ బాబు లుక్ ఏ విధంగానూ బయటకు రాకూడదని రాజమౌళి ఇలాంటి కండిషన్ పెట్టాడట. అయితే ఇక ఈ మూవీలో హీరో గెటప్ పై కొన్ని స్కెచ్ లు వేయించాడట జక్కన్న. ఇక నెలరోజుల పాటు మహేష్ బాబుకు లుక్ టెస్ట్ జరుగుతుందట. ఇక ఫైనల్ లుక్ కి తగ్గట్టుగానే మహేష్ బాబు మేకోవర్ కావలసి ఉంటుందట. అయితే కాస్త గ్యాప్ దొరికితేనే ఫ్యామిలీతో విదేశాలకు టూర్ కి వెళ్లే మహేష్ బాబు ఇక రాజమౌళి సినిమా పూర్తి అయ్యేంతవరకు ఎలా కంట్రోల్ లో ఉంటాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: