రవితేజ వాయిస్ ఇస్తే.. సినిమా సూపర్ హిట్టేనా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు రవితేజ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన రవితేజ.. ఇక ఇప్పుడు తన టాలెంట్ తో హీరోగా హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా రవితేజకు మాత్రం ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

 ఇక ఎప్పుడూ కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి రవితేజ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అంతేకాదు ఇక తనలాగా ఎంతో కష్టపడి పైకి వస్తున్న వారికి తన వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ రవితేజ సిద్ధంగానే ఉంటారు. కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడమే కాదు ఇంకొన్ని సినిమాలకు తన వాయిస్ ని ఇస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇటీవలే ఇక హనుమాన్ అనే సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు రవితేజ. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపద్యంలో రవితేజ వాయిస్ ఇచ్చాడు అంటే ఇక సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

 ఇలా ఇప్పటివరకు మాస్ మహారాజ రవితేజ హీరోగా మాత్రమే కాదు మిగతా హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా వారి విజయాల్లో భాగమవుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా రవితేజ ఎన్నో సినిమాలకు వాయిస్ ఇచ్చారు అని చెప్పాలి. ఇక రవితేజ వాయిస్ ఇచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ గా నిలిచాయ్. మర్యాద రామన్న లో సైకిల్ కి, awe లో బోన్సాయి ప్లాంట్ కి, మహావీరుడులో మైండ్ కి ఇక ఇప్పుడు హనుమాన్ లో కోతికి వాయిస్ ఇచ్చారు. ఇలా తానే కాదు తన వాయిస్ కూడా హిట్టు కొడుతుంది అని నిరూపించాడు రవితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: