చిరుతో నిజంగానే మల్టీస్టారర్ చేయాలని ఉందా.. వెంకీ ఏమన్నాడంటే?

praveen
టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ గత కొంతకాలం నుంచి ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏదో ఒక యువ హీరోతో కలిసి నటించి ప్రేక్షకులను పలకరిస్తున్నాడు అని చెప్పాలి. అయితే చాలాకాలం తర్వాత వెంకటేష్ ఏకంగా సైంధవ్ అనే సినిమాతో ఇండివిజువల్ గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇటీవల ట్రైలర్ అయితే వెంకీ అభిమానులందరికీ కూడా గుస్ బంప్స్ తెప్పిస్తుంది అని చెప్పాలి.

 అయితే గత కొంతకాలం నుంచి మల్టీస్టారర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వెంకటేష్ ఇక ఇప్పుడు ఒక సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉంది అంటూ ఇటీవల ఒక ఈవెంట్ లో చెప్పాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని ఉంది అని ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పగా.. పక్కనే ఉన్న చిరంజీవి ఓఎస్ అంటూ వెంకీ తో చేతులు కలిపాడు. దీంతో చిరు-  వెంకీల మల్టీ స్టారర్ ప్రస్తావన బయటకు వచ్చింది. అయితే ఎంతో మంది దర్శకులు హీరోలు ఇలా ప్రెస్ మీట్ లు ఈవెంట్లలో ఇలాంటి స్టేట్మెంట్లు కగూప్పించడం కొత్తేమి కాదు. అయితే వాటిని నిలబెట్టుకున్న దాఖలాలు మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. కేవలం సినిమా ప్రమోషన్స్ కి ఈ కంటెంట్ పనికొస్తుంది అనే కారణంతోనే విమర్శలు చేస్తూ ఉంటారు.

 నిజంగానే మెగాస్టార్ చిరంజీవితో  వెంకటేష్ కు సినిమా చేయాలని ఉందా అనే విషయం ఇటీవల సైంధవ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు వెంకటేష్. చిరంజీవితో తనకు సినిమా చేయాలని ఉందని.. అయితే అదంతా దర్శకులు రచయితల చేతుల్లో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళు మంచి కథలు తీసుకువస్తే తమకు నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇద్దరు హీరోలు పక్కపక్కనే ఉంటే చూడడానికి బాగుంటుందని ఆ ఉద్దేశంతోనే తాను సినిమా చేస్తానని చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చాడు వెంకీ మామ. అయితే గతంలో చిరు తమ్ముడు పవన్ తో గోపాల గోపాల, మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇక వరుణ్ తేజ్ తో ఎఫ్2, ఎఫ్3, నాగచైతన్యతో వెంకీ మామ లాంటి మల్టీ స్టారర్ సినిమాలను చేశాడు వెంకటేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: