KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'సలార్' పార్ట్-1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. హోంబలే ఫిల్మ్స్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించగా మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావ్ కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.650 కోట్ల మార్క్ అందుకున్న ఈ సినిమా వేయి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే సలార్ పార్ట్-1 చూసిన వాళ్లంతా పార్ట్-2 కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సలార్ అసలు కథ పార్ట్-2 లోనే ఉండబోతుంది. సలార్ పార్ట్ 2 ని 'శౌర్యంగ పర్వం' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ పార్ట్ షూటింగ్ ని త్వరలోనే మొదలు పెడుతున్నారని, 2024 లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం 2024 లో సలార్ పార్ట్-2 వచ్చే అవకాశాలు లేవు.
ప్రభాస్ ప్రస్తుతం కల్కి, స్పిరిట్, మారుతి మూవీ, హను రాఘవపూడితో లవ్ స్టోరీ.. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వీటిలో కల్కి, మారుతి సినిమాలు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి అయిన తర్వాతే ప్రభాస్ 'సలార్ 2' సెట్స్ లో అడుగు పెడతాడు. అటు సందీప్ వంగా మరో ఆరు నెలల్లో డైరెక్టర్ సందీప్ వంగ స్పిరిట్ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత హను రాఘవపూడి ప్రభాస్ తో చేయబోయే పీరియాడికల్ ఎవరికోసం సిద్ధమవుతాడు. ఇక ప్రశాంత్ నీల్ కూడా ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు సలార్ పార్ట్-2 కి సంబంధించి ఎలాంటి షూటింగ్ జరగలేదు.