నాకు ఆ పని చేతకాదు.. నిజం ఒప్పేసుకున్న రామ్ చరణ్?

praveen
ఇటీవల కాలంలో స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాల్లో సంపాదించింది అంతా వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఇక వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా భారీగా సంపాదిస్తూ రెండు చేతులారా డబ్బులను వెనకేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోల్లో సినిమాల్లోనే కాదు బిజినెస్ లో కూడా దూసుకుపోతున్న వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇంకొంతమంది కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి అనే ఆలోచన కూడా చేస్తూ ఉండడం గమనార్హం.

 అయితే ప్రస్తుతం మెగాస్టార్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ దూసుకుపోతున్నాడు. కానీ వ్యాపారాలు చేయడం మాత్రం తన వల్ల కాదు అంటూ చెబుతున్నాడు రామ్ చరణ్. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇదే విషయంపై ప్రశ్నలు ఎదురవడంతో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు రెండు పడవల ప్రయాణం అసలు చేతకాదు. నేను అలా చేయడానికి కూడా వీల్లేదు అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే నేను ఒక బ్యాడ్ బిజినెస్ మాన్ అంటూ చరణ్ తెలిపాడు..

 నాకు కేవలం సినిమాలు మాత్రమే సెట్ అవుతాయి. కొంతమంది సినిమాలు చేసుకుంటూనే బిజినెస్ లు కూడా చేస్తారు. కానీ నాకు బిజినెస్ లు చేయడం సెట్ కాదు. అయితే నేను గతంలో కొన్ని బిజినెస్ లు చేసి అందులో ఎలా రాణించాలో తెలియక చివరికి డబ్బులు పోగొట్టుకున్నాను. అందుకే బిజినెస్ రంగం వైపు ఇప్పుడు అడుగులు వేయట్లేదు. సినిమాలు, మూవీ ప్రొడక్షన్ వంటికి వాటికి సంబంధించి ఏ పనైనా చేయగలుగుతాను. కానీ బిజినెస్ లు చేయడం మాత్రం నాకు అస్సలు రాదు. బిజినెస్ లొ ఉండే అంకేలతో నేను డీల్ చేయలేను అంటూ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాడు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: