టాలీవుడ్ లో వేణు స్వామి కొందరి జాతకాలతో పాటు వ్యక్తిగత జీవితాలపై జ్యోతిష్యం చెబుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంటాడు. చాలామంది సెలబ్రిటీల జాతకాలు ఈయన చెప్పినట్టే జరిగాయనే ప్రచారం కూడా ఉంది. ఈయన చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు కూడా బెడిసి కొట్టడం చూస్తూనే ఉన్నాం. ప్రభాస్ నటించే సినిమాలన్నీ ప్లాప్స్ అవుతాయని అతనికి సక్సెస్ రాదని గతంలో వేణు స్వామి చెప్పాడు. కట్ చేస్తే సలార్ బ్లాక్ బాస్టర్ అవడంతో వేణు స్వామి పై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
అయితే ఈ విషయంలో బాహుబలి తర్వాత ప్రభాస్ 4 సినిమాలు చేస్తే మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి అని ఒక్క సినిమా మాత్రమే హిట్ అయిందని వేణు స్వామి తనని తాను సమర్ధించుకున్నాడు. తాజాగా ఈయన విజయ్ దేవరకొండ, రష్మిక లవ్ ఎఫైర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్, రష్మిక రిలేషన్షిప్ గురించి యాంకర్ ప్రశ్నించగా వేణు స్వామి అందరికీ తెలిసిందే కదా అని అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. కానీ విడిపోతారు అంటూ సంచలన కామెంట్ చేశారు. డైరెక్ట్ గా నేను ఈ విషయాన్ని రష్మికకే చెప్పాను. విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకోకు అని.
విషయంలో రష్మికకు నాకు కూడా గొడవలు జరిగాయి. విభేదాలు వచ్చాయి. అప్పటివరకు నా క్లయింట్ గా ఉన్న రష్మిక ఆ గొడవతో దూరంగా ఉండిపోయింది. అయినా నాకేం ఇబ్బంది లేదు" అంటూ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు వేణు స్వామి. దీంతో విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ పై వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. కాగా గతంలో రష్మిక వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే రష్మిక, విజయ్ దేవరకొండ విషయంలో వేణు స్వామి చెప్పేది నిజమవుతుందేమోనని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.