ప్రభాస్ వల్లే 'సలార్' కి 'A' సర్టిఫికేట్ వచ్చింది..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ -పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'సలార్'   థియేటర్స్ లో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది. డార్లింగ్ ఫాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ దగ్గర పడటంతో మూవీ టీం రాజమౌళి తో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమారన్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ కి 'A' సర్టిఫికెట్ రావడంపై క్లారిటీ ఇచ్చారు. 

సాధారణంగా ప్రభాస్ సినిమా అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ చూస్తారు. అలాంటిది సలార్ సినిమాకి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ ఇవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. రీసెంట్ గా 'యానిమల్' మూవీకి 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి 'A' సర్టిఫికెట్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ సలార్ మూవీకి 'A' సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అనే విషయం చాలామందికి అర్థం కాలేదు. ఇదే విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.." సలార్ ప్రివ్యూ అయ్యాక సెన్సార్ అధికారులు చాలా కట్స్ చెప్పారు. దానికి నాకు ఇష్టం లేకపోయినా ఓకే చెప్పాను. 

కానీ ప్రత్యేకంగా కొన్ని కట్స్ మాత్రం కథ వెళ్లే ప్లోని దెబ్బతీస్తాయని భావించి ఏం చేయాలో ప్రభాస్ ని అడిగితే సింపుల్ గా 'A' సర్టిఫికెట్ తీసుకోమని చెప్పాడు. దాంతో మరుక్షణం ఆలోచించకుండా కట్స్ వద్దని చెప్పేసాను. ఫలితంగా 'U/A బదులు 'A' సర్టిఫికెట్ మాత్రమే వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సలార్ లో తాను చూపించింది అవసరమైన రక్తపాతమే తప్ప బలవంతంగా ఇరికించిన హింస ఏమాత్రం కాదని, ఇందులో రొమాన్స్, సెక్స్, సెట్ సాంగ్స్ ఇవేమీ ఉండవని మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఇక ఇదే ఇంటర్వ్యూలో సినిమాలో ప్రభాస్ పోషించిన దేవా క్యారెక్టర్రైజేషన్ పై మాట్లాడిన ప్రశాంత్ నీల్," సింగిల్ లైన్ లో సలార్ లో ప్రభాస్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందనేది చెప్పాడు  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: