చరణ్ అభిమానులకు నిరాశ.. కారణమదే..!!

Divya
రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్.. ఈ సినిమా కోసం చరణ్ అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కొన్ని కారణాల చేత షూటింగ్ లేట్ అవుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి పలు రకాల అప్డేట్లు కూడా చిత్ర బృందం ఇవ్వకపోవడంతో అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేయడంతో ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ టైటిల్ తప్ప మరే అప్డేట్ ని కూడా తెలుపలేదు.



కేవలం మధ్య మధ్యలో కొన్ని వచ్చిన లీక్స్ తప్ప మరి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ ను సైతం ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇటి వలే ఈ సినిమా నుంచి జరగండి అనే ఒక సాంగ్ని లీక్ అవ్వడంతో అది వైరల్ గా మారింది. ఈ సాంగ్లో చేసిన వారి పైన కూడా కేసు పెట్టి అరెస్టు చేసినట్లుగా సమాచారం.


ఈ పాటని అఫీషియల్ గా దీపావళికి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించి ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. కానీ మళ్లీ అప్పటినుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. గత కొద్ది రోజులుగా జరగండి అనే సాంగ్ పోస్ట్ పోన్ అవుతూ ఉన్నది. ఇప్పుడు తాజాగా మళ్లీ అభిమానులను నిరాశపరిచే విధంగా చిత్ర యూనిట్ ఈ సాంగ్ ని రిలీజ్ చేయలేదంటూ ఆడియో డాక్యుమెంట్ ఇష్యూ వచ్చాయని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామంటూ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని ఒక లెటర్ ద్వారా తెలియజేశారు. దీంతో రాంచరణ్ అభిమానులు సైతం పరిరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించి ఒక పెట్టు వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: